ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

సూర్యపేట జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి విజయవాడకు వారి బంధువైన చంద్రశేఖర్ కారు AP28CD 6851లో వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ముకుందపురం వద్ద ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్ల చెందిన కొల్లపూడి ధనలక్షి మరియు మరో వ్యక్తి చనిపోగా.. పెండ్యాల సాయి సందీప్ కు తీవ్ర గాయాలయ్యాయి. సందీప్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More News..

ట్రాక్ పై పడుకున్న కూలీలు.. మీదినుంచి దూసుకెళ్లిన రైలు

Latest Updates