ఫోన్ మాట్లాడుతు కారు డైవింగ్: కాలువలోపడి ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి SRSP కాకతీయ కాలువలో పడి దంపతులిద్దరు చనిపోయారు. వీరిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన మాచర్ల శ్రీనివాస్, స్వరూపలుగా గుర్తించారు. లోయర్ మానేరు గట్టుపై చేపలు కొని.. ఫోన్లో మాట్లాడుతూ కారు రివర్స్ చేస్తుండగా కారు నీటిలో పడిపోయింది. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొంతదూరం కారు నీటిలో కొట్టుకపోయింది. చేపలు అమ్ముకునేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కారుతో పాటు మృతదేహాలను బయటకు తీశారు.

Latest Updates