సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కారు బీభత్సం

హైదరాబాద్‌ బేగంపేట్ సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర  ఓలా కారు బీభత్సం సృష్టించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు ఇద్దరు ప్యాసింజర్లను తీసుకువస్తున్న కారు.. క్యాంపు ఆఫీస్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ మధ్యలో ఏర్పాటు చేసిన గేటును బలంగా ఢీకొంది. దీంతో గేటు విరిగిపోయింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్‌ హేమంత్‌తో పాటు కారులో ఉన్న మహిళలకు స్పల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ సిబ్బంది కారును అక్కడి నుంచి తరలించారు.నిద్రమత్తు, అతివేగం ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రయాణికులిద్దరూ కొంపల్లి నుంచి ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌ చేతికి గాయం కావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Latest Updates