కారుబోల్తా ..ఒకరి మృతి నలుగురికి సీరియస్

హైదరాబాద్, వెలుగు: శంకర్ పల్లి–సంగారెడ్డి బైపాస్ రోడ్ లో కారు బోల్తా పడి ఒకరు చనిపోయారు. నలుగురికి సీరియస్ గా ఉంది. శంకర్పల్లి ఎస్ఐ గోపీనాథ్ వివరాల ప్రకారం…బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్నెన్స్ డి ఫ్యాక్ట‌రీ నుంచి నిరంజన్(35), రాజశేఖర్, శ్రీకాంత్, శరత్, సతీశ్ రెడ్డి కారులో శంకర్ పల్లికి వెళ్లారు. సాయంత్రం తిరిగి సంగారెడ్డికి బయల్దేరారు.

ఓవర్ స్పీడ్ కారణంగా బైపాస్ లోని కల్వర్టు దగ్గర కారు బోల్తా పడింది. నిరంజన్ అక్కడిక్కడే చనిపోయాడు. మిగతా నలుగురికి తీవ్రగాయాలవడంతో పత్తేపూర్ మెడిక్యూర్ హాస్పిట‌ల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డికి తీసుకెళ్లారు. నిరంజన్ లాక్ డౌన్ కి ముందు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు తెలిసింది.

Latest Updates