పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ధర్మారం : కారు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి దగ్గర కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు.  ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిని కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాగి వీరేశం (78), కరీంనగర్‌ లో నివాసముండే వీరేశం కూతురు కొండూరి పద్మ (51), అల్లుడు కొండూరి మనోహర్ (56)గా గుర్తించారు. వీరంతా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు కారులో బయల్దేరారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మనోహర్, ముందు సీట్లో కూర్చున్న వీరేశం అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న సరోజన, పద్మ తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని హస్పిటల్ కి తరలించారు. హస్పిటల్ లో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది. మూడు మృతదేహాలను కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన హస్పిటల్ కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

 

Latest Updates