కారులో మంటలు..తప్పిన ప్రమాదం

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం బోధనంపల్లిలో ఓ కారు మంటల్లో కాలిపోయింది. కారు ఓనర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన ఓనర్.. కారును పక్కన ఆపేశారు. కొద్దిసేపట్లోనే మంటలు భారీగా ఎగసిపడ్డాయి. కారు పూర్తిగా కాలిపోయింది. కారులో 2 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు ఓనర్ చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Latest Updates