బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. భయంతో పరుగులు

బంజారాహిల్స్ లో కారు బీభత్సం  సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్నకారు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో కారును ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కారులో ఉన్న ముగ్గురు యువకులు అత్తాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Updates