కారులో భారీ పేలుడు పదార్థాలు.. ఓనర్ ను గుర్తించిన పోలీసులు

  • పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న
  • కేసులో పురోగతి సాధించిన పోలీసులు

శ్రీనగర్‌‌: సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఎటాక్‌ చేసేందుకు పుల్వామాలో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన కారు హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌ హిదయతుల్లా మాలిక్‌కి చెందిందని పోలీసులు గుర్తించారు. ఇతను జమ్మూకాశ్మీర్‌‌లోని షోపియాన్‌కు చెందిన వ్యక్తి. 2019 జులై నుంచి హిజ్బుల్‌ టెర్రర్‌‌ గ్రూప్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హిదయతుల్లా తమ్ముడు సమీర్‌‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని అన్నారు. సమీర్‌‌ అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో కారు బాంబు దాడి చేసిన విధంగానే దాడి చేసేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించిగా సెక్యూరిటీ సిబ్బంది దాన్ని తిప్పికొట్టింది. 45 కిలోల ఐఈడీతో ఉన్న వెహికల్‌ను సీజ్‌ చేసి ధ్వంసం చేసింది.

Latest Updates