హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

హైదరాబాద్ లోని భరత్ నగర్లో ఇవాళ తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వస్తుండగా భరత్ నగర్ బ్రిడ్జి పై నుండి కారు అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కారు ప్రమాదానికి ర్యాష్ డ్రైవింగ్ కారణమని తెలుస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సునీల్ తో పాటు కారులో మరో నలుగురు ఉన్నారు. సునీల్ పక్కన కూర్చున్న సోహైల్ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయాలైన సునీల్, ఇర్పాన్ ,అశ్వక్ ,గౌస్ లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా బోరబండ నెహ్రూ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates