ఐటీ కారిడార్ లో కనిపించని కార్ ఫ్రీ థర్స్ డే

రోజురోజుకు పెరిగిపోతున్న వాహన కాలుష్య నియంత్రణకు చేపట్టిన కార్యక్రమం మరుగున పడిపోయింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఐటీకారిడార్ ప్రాంతంలో ప్రతి గురువారం కార్లు వినియోగించకుండా, సైకిళ్లపై వచ్చేలా అవగాహన కార్యక్రమాన్ని మూడేళ్ల క్రితం మొదలుపెట్టారు.‘కార్ ఫ్రీ థర్స్ డే’ అంటూ అప్పట్లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కడ చూసినా బ్యానర్లు, ప్లకార్డులతో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సైక్లిస్టులు, ఐటీ నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నా ,కాలక్రమంలో మరిచిపోయారు. దీంతో కార్ ఫ్రీథర్స్ డే కాస్తా… బ్రేక్ ఫ్రీ థర్స్ డే గా మారిపోవడంతో వేలాది వాహనాలు రోడ్లపై చేరిపోతున్నాయి.పలు స్వచ్చంద సంస్థలు, ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో కార్ ఫ్రీథర్స్ డే ను 2015లో చేపట్టారు.

వారంలో ప్రతిగురువారం వ్యక్తిగత వాహనాలను వినియోగించకుండా, ఆఫీసు కెళ్లేందుకు సైకిల్ వాడాలంటూ విస్తృ త ప్రచారంతో పాటు అవగాహన కల్పించారు. దీనికి అప్పటి సైబరాబాద్​ కమిషనర్ పలు కంపెనీలను భాగస్వామ్యం చేస్తూ భారీ స్థాయిలోప్రారంభించారు. అయితే మొదలైన ఏడాది పాటు నిర్విఘ్నంగా ముందుకు సాగిన ఈ కార్ ఫ్రీ థర్స్ డే కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి ఇక ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వారు,పర్యవేక్షించే వారే కరువయ్యారు. దీంతో నిత్యం వేలాది వాహనాలు రయ్ మంటూ హైటెక్ సిటీ కారిడార్ లో చక్కర్లు కొడుతున్నాయి. 2015 లెక్కల ప్రకారం హైటెక్ సిటీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య సుమారు 4 లక్షలు ఉండగా,ఇందులో 25 శాతానికి మించి వ్యక్తిగత కార్లను వినియోగించినవారే ఉన్నారు. ఇక 10 శాతం ఉద్యోగులు మాత్రమే కంపెనీలు కల్పిస్తున్న క్యాబ్ సౌకర్యంలో ప్రయాణిస్తున్నారు. అయితే ఐటీ ఉద్యోగుల సంఖ్య 5.5 లక్షలకు దాటిపోయిందనీ తాజా గణాంకాలు చెబుతుండగా, ప్రస్తుతం సొంత వాహనాలు, క్యాబ్ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి రావడంతో కార్లలో ప్రయాణించే వారి సంఖ్య 35 శాతానికి మించి ఉంటుందనేది ఓ అంచనా.

లక్ష్యాన్ని చేరుకోకముందే..

ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి,రహేజా, మాదాపూర్, బయో డైవర్సిటీ వంటి ప్రాంతాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో నిత్యం పర్యావరణంపై విపరీతమైన ప్రభావం పడుతోంది. దీనికి తోడు వేలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో ఈ ప్రాంతాల్లో ప్రయాణమంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది.దీంతో కనీసం వారంలో ఒక రోజైనా సైకిళ్లపై ఆఫీసుకెళ్లడం వలన వాహనాల రద్దీ, కాలుష్య నియంత్రణ, వ్యక్తిగత ఆరోగ్యం పై అవగాహన, పబ్లిక్ట్రాన్స్ పోర్టు వ్యవస్థను బలోపేతం చేసేం దుకు ఎంతగానో ప్రచారం చేయడంతో టెక్కీల నుంచి భారీ స్పందనే వచ్చింది. ఏడాది పాటు సక్రమంగానే నడిచినా లక్ష్యాన్ని చేరుకోక ముందే చివరకు మరుగునపడిపోయింది. దీంతో నగరవ్యాప్తంగాఈ కార్యక్రమాన్ని విస్తరిం చాలనుకున్న అప్పటి సీపీ సీవీ ఆనంద్ ఆశయానికి అక్కడితో ఫుల్స్టాప్ పడిం ది. దీంతో ఆ ప్రాంతంలో చేపట్టినట్రాఫిక్ నియంత్రణ చర్యలు అంతగా ప్రయోజనం చూపడం లేదు. దీంతో కాలుష్య రహిత విశ్వనగరాన్ని భవిష్యత్ తరాలకు అందిం చాలన్నఆకాం క్ష నెరవేరకుం డానే ఆగిపోయింది. అదే విధంగా కార్ ఫ్రీ థర్స్ డే ప్రోగ్రాంతో నగరంలో కార్ పూలింగ్ పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం సాయపడినా, అసలు ప్రోగ్రామే పట్టించుకోకపోవడంతో, కార్ పూలింగ్ కోసం చేసిన ప్రయత్నాలు వృథాగా మారిపోయాయి. దీంతో వాహనాల రద్దీ విపరీతంగా తగ్గే అవకాశంఉన్నా , ముందుం డి నడిపించేవారు లేకపోవడంతో కార్ పూలింగ్​ యాప్ లకు ప్రాధాన్యత తగ్గింది.

 

Latest Updates