బంజారాహిల్స్ లో కారు బీభత్సం

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు రాయల్ టిఫిన్ సెంటర్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో అందులోని వారు సేఫ్ గా బయటపడ్డారు. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.  ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి, అందులోని యువకులు పరారయ్యారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్టు స్థానికులు  చెబుతున్నారు. పంజాగుట్ట వైపు వెళ్లే రూట్లో   రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్ గా మారిందని, గతంలోనూ ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయంటున్నారు స్థానికులు.

Latest Updates