షాపులోకి దూసుకెళ్లిన కారు.. గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసం

విజయవాడ: నగరంలోని సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో  ఓ కారు(మహీంద్రా XUV500 ) భీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున  TN04 AJ 5575 నంబరు గల ఓ కారు అతివేగం కారణంగా అదుపు తప్పి ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గూడ్స్ ఆటోలు, బైకులు ధ్వంసమయ్యాయి. ఉదయం కావడం..  జనం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైనర్స్ డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Latest Updates