జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పల్టీలు కొట్టిన కారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్ గా వచ్చిన ఓ కారు అక్కడి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. అయితే కారు ప్రమాదంలో ఎలాటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కారు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు…తమ సిబ్బందితో కారును అక్కడి నుంచి తొలగించి…ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Latest Updates