కారు-లారీ ఢీ..ఇద్దరు మృతి

నిజామాబాద్ : కారు, లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా.. మద్దూరు శివారులో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు – లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని జిల్లా కేంద్రంలోని హస్పిటల్ కి తరలించారు. మృతులు గచ్చిబౌలి వాసులుగా గుర్తించారు. షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates