బీచ్ రోడ్డులో మాజీమంత్రి కుమారుడు హల్ చల్

విశాఖ బీచ్ రోడ్డులో మాజీమంత్రి  బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి  ఓ బైకును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో టూవీలర్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  కారు డివైడర్  పై నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టింది.  వాకర్స్  ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే మంత్రి కుమారుడు అప్పలనాయుడును స్థానికులు చితకబాదారు దీంతో అక్కడి నుంచి పరారయ్యాడు .

 

Latest Updates