
ఆవు పెండ. పొద్దున లేస్తే.. గ్రామాల్లో సాన్పు చల్లేందుకు వాడుతుంటారు. పిడకలు, గొబ్బెమ్మలు కూడా దానితోనే తయారుచేస్తుంటారు. ఆవు, బర్ల పెండ యాంటీ బయాటిక్ గా కూడా పనిచేస్తుంది. కొందరు మెడిసిన్స్ లో కూడా వాడుతుంటారు. ఐతే.. సిటీ జనం అదే పెండ చూస్తే.. అబ్బో గబ్బు వాసన.. అంటూ ముక్కు మూసుకుంటారు.
గోడకు పిడకలు కొడితే వింత కాదు. కానీ దాన్నే.. కారుకు కొడితే అది న్యూస్. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అయిన ఓ కారు… అహ్మదాబాద్ లో హాట్ టాపిక్ అయింది. అదో లగ్జరీ కారు. Toyota Corolla Altis. మండే ఎండల్లో చల్లదనం కోసం కారుకు పెండతో పూత పూయించారు కారు ఓనర్ మిసెస్ సెజాల్ షా.
పెండ పూత పూసిన ఈ కార్ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ లగ్జరీ కార్ కు డంగ్ పూయడం ఇదే మొదటిసారి చూడటం అని కొందరు అభిప్రాయపడ్డారు. 45 డిగ్రీల ఎండలో కార్ ను కాపాడుకునేందుకు క్రియేటివ్ గా ఆలోచించారని మరికొందరు అన్నారు.
