విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు

కేరళ రాష్ట్రం అలప్పుజా దగ్గర్లోని పోచక్కల్ లో దారుణం జరిగింది. మనోజ్ అనే డ్రైవర్ అతి వేగంగా కారు నడిపి 8మందికి యాక్సిడెంట్ చేశాడు. వీరిలో నలుగురు స్కూలు అమ్మాయిలు ఉన్నారు. విద్యార్థులు అనఖా, అర్చనా, చందన, రాఖీలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ తప్పతాగి డ్రైవింగ్ చేశాడని పోలీసులు తేల్చారు. మనోజ్ తో పాటు.. కారులోనే ఉన్న అస్సామ్ యువకుడు ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ లో వీరికి కూడా గాయాలు కావడంతో.. హాస్పిటల్ లో చేర్చారు.

Latest Updates