పార్కింగ్ చేస్తానంటూ కారు చోరీ

హైదరాబాద్, వెలుగు: వ్యాలెట్ బాయ్ నంటూ నమ్మించి ఓ యువకుడు కారుతో ఉడాయించాడు. కేపీహెచ్ బీ ఇన్స్ పెక్ట‌ర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. పటాన్ చెరు పరిధి అమీన్ పూర్ లో ఉండే మహ్మద్ ఆదిల్హాసన్(23) డిగ్రీ మధ్యలో ఆపేసి స్విగ్గీలో డెలివరీ బాయ్ గా చేరాడు. ఈ నెల19న సాయంత్రం నిజాంపేట చౌరస్తాలో పిస్తా హౌస్ రెస్టా రెంట్ వ‌ద్ద బైక్ పార్క్ చేసి నిలబడ్డాడు. కొత్త మారుతి స్విఫ్ట్ లో వచ్చిన ఫ్యామిలీని.. తాను వ్యాలెట్ పార్కింగ్ బాయ్ గా నమ్మించి కారుతో పరారయ్యాడు. బాధితుల కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates