చెరువులోకి బోల్తా కొట్టిన కారు.. ఎస్.ఐ సురక్షితం

కరీంనగర్: రోడ్డు ప్రమాదాల్లో ఇవాళ ఓ అద్భుతం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డుపక్కన చెరువులోకి పడిపోయినా.. అందులో ప్రయాణిస్తున్న ఎస్.ఐ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని చెరువు  దగ్గర జరిగిందీ ఘటన. జగిత్యాల కమ్యూనికేషన్ ఎస్ఐ నర్సింగరావు స్వయంగా కారు నడుపుతుండగా చెరువు దగ్గర ప్రమాద వశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారు అదుపుతప్పి చెరువులోకి పడిపోయింది. అయితే నీటిలో కాకుండా పక్కన గడ్డి పరకలున్న గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎస్.ఐ నర్సింగరావు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక చికిత్స చేయించుకుని వేరే వాహనంలో వెళ్లిపోయారు.

 

Latest Updates