కెరీర్​​ డిజైన్​ విత్​ ‘వెబ్​ డిజైనింగ్’

డిజిటల్​ ప్రపంచంలో ప్రతి సంస్థకు గుర్తింపు అవసరం.. గల్లీలో ఉన్న చిన్న స్టార్టప్​ కంపెనీ నుంచి గచ్చిబౌలిలోని మల్టీనేషనల్​ కంపెనీ వరకు అన్నిటికి అతి ముఖ్యమైనది వెబ్​సైట్​. దీని ద్వారా ఆయా కంపెనీలు కస్టమర్​ను ఈజీ అప్రోచ్​ అవ్వొచ్చు. ఏ సమాచారాన్నైనా ఈజీగా యూజర్​ యాక్సెస్​ చేయడానికి సంస్థలు వెబ్​సైట్​ను మెయింటెయిన్​ చేస్తాయి. దీని​ ద్వారా తమ కంప్లీట్​ సర్వీసెస్​ గురించి యూజర్​కు ఇన్ఫర్మేషన్​ ఇస్తాయి. ఇది కంపెనీకి యూజర్​కు మధ్య వారధిలా పనిచేసి బిజినెస్​ డెవలప్​మెంట్​కు సహకరిస్తుంది. మరి కంపెనీకి కావాల్సిన ఈ వెబ్​సైట్​​ను

ఎవరు డిజైన్​ చేస్తారు? వారికి కావాల్సిన క్వాలిఫికేషన్​ ఏంటి?

ఉండాల్సిన స్కిల్స్​ ఏంటి? నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్​ వంటి ముఖ్య సమాచారం  తెలుసుకుందాం.

 

ఏదైనా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్​ను యూజర్​కు తెలియజేయడానికి ఇంటర్నెట్​లో వెబ్​ పేజెస్​ను డిజైన్​ చేయాలి. ఆ సెట్ ఆఫ్​ వెబ్​ పేజెస్​ను వెబ్​సైట్ అంటారు. దీన్ని రూపకల్పన చేసే బాధ్యత వెబ్​ డిజైనర్​దే. ఒక కంపెనీకి సంబంధించిన  ప్రోడక్ట్స్​, సర్వీసెస్​, లోగో, బ్యానర్లు, అడ్వర్టైజ్​మెంట్​, కాంటాక్ట్​ డీటైల్స్​, రూట్​ మ్యాప్​ వంటి కంప్లీట్​ ఇన్ఫర్మేషన్​ను యూజర్​ ఫ్రెండ్లీగా తీర్చిదిద్ది అందించడంలో వీరి​​ పాత్ర కీలకం. యూజర్​ తనకు కావాల్సిన సమాచారాన్ని ఈజీగా యాక్సెస్​ చేసుకునే విధంగా ఎటువంటి కాంప్లెక్సిటీ లేకుండా వెబ్​సైట్​ను​ రూపొందించేవారే వెబ్​ డిజైనర్స్​.

అట్రాక్టివ్గా వెబ్సైట్స్

ఏ వెబ్​సైట్​ అయినా అవసరమైన ఇన్ఫర్మేషన్​ను, ఇమేజస్​ను సింపుల్​ లాంగ్వేజ్​లో యూజర్​కి అర్థమయ్యేలా రూపొందించాలి. అంటే దాన్ని క్లిక్​ చేస్తున్నవారు సులభంగా ఆపరేట్​ చేయగలగాలి. అంతేకాక బ్యాక్​ గ్రౌండ్ వాల్​పేపర్​, టెక్ట్స్​ మాటర్స్​కు రంగుల కాంబినేషన్​ బాగుండాలి. వెబ్​ పేజీలు సులువుగా డౌన్​లోడ్ కావాలి. కాంప్లెక్స్​గా లేకుండా సమాచారాన్ని కేటగిరీ వారీ  డివైడ్​ చేసి యూజర్​ ఫ్రెండ్లీగా డిజైన్​ చేయాలి.

టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్

మారుతున్న కస్టమర్​ రిక్వైర్​మెంట్​కు అనుగుణంగా వెబ్​సైట్ అట్రాక్టివ్​గా ​ను తీర్చిదిద్దడం కీలకం. కాబట్టి యూజర్​ రిక్వైర్​మెంట్​ను బేస్​ చేసుకొని స్టాటిక్​, డైనమిక్ అనే రెండు రకాల వెబ్​సైట్స్​ డిజైన్​ చేస్తున్నారు. ​

స్టాటిక్​ వెబ్​సైట్స్​: యూజర్​తో ఎలాంటి ఇంటరాక్షన్​ చేయలేని వెబ్​సైట్స్​నే స్టాటిక్ వెబ్​సైట్స్​గా పిలుస్తారు. ఈ వెబ్​సైట్స్​ను సింపుల్ ప్రోగ్రామింగ్​​తో కూడా డిజైన్​ చేయవచ్చు. దీన్ని ఎవరు యాక్సెస్​ చేసినా సిమిలర్​గా కన్పిస్తుంది. అయితే స్టాటిక్​ వెబ్​పేజీల్లో సమాచారమంతా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాన్యువల్​గా డిజైనర్​ మార్పులు చేస్తారు.

డైనమిక్​ వెబ్​సైట్స్​: యూజర్​ అభిరుచులు, హిస్టరీని బట్టి కేవలం తనకు కావాల్సిన  సమాచారాన్ని ఎక్కువగా చూపించేవే డైనమిక్​ వెబ్​సైట్స్​. యూజర్​తో ఇంటరాక్ట్​ అవుతూ వారికి కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాటికవే అప్​డేట్​ అవుతాయి. దీనిలో యూజర్​ ఇచ్చిన ఇన్​పుట్​ ప్రకారం ఇన్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది. దీనికి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, బిగ్​ డాటా అనలటిక్స్​ వంటి న్యూ టెక్నాలజీస్​ అవసరం. ఉదాహరణకు మనం అమెజాన్​లో ఏదైనా వస్తువును సెర్చ్​ చేస్తే.. తర్వాత మనం అదే సైట్​ను ఓపెన్​ చేసినప్పుడు ఆ వస్తువు​కు సంబంధించినవే మొదటగా కన్పిస్తాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తోనే సాధ్యం అవుతుంది. కాబట్టి యూజర్​ సెర్చింగ్​ హిస్టరీని బట్టి  కంపెనీలు తమ బిజినెస్​ డెవలప్​మెంట్​కు, ఈజీ యాక్సెస్​కు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించుకుంటున్నాయి.

క్వాలిఫికేషన్

బేసిక్​ కంప్యూటర్​ స్కిల్స్​ ఉన్న వారెవరైనా వెబ్​సైట్స్​ను క్రియేట్ చేయవచ్చు. కానీ ప్రొఫెషనల్​ వెబ్​ డిజైనర్​గా మంచి ఎంఎన్​సీ కంపెనీలో జాబ్​ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఏదైనా డిగ్రీ, బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండటం ఉత్తమం. అంతేకాక క్లయింట్​తో నేరుగా మాట్లాడటానికి మంచి కమ్యూనికేషన్​ స్కిల్స్​ కలిగి ఉండాలి.

రిక్వైర్డ్ టెక్నాలజీస్

వెబ్​డిజైనింగ్​లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్​ఎండ్​ డిజైనర్ల​ది కీలక పాత్ర క్లయింట్ సైడ్​ వెబ్​ డెవలప్​ చేసే వారిని ఫ్రంట్ ఎండ్ డిజైనర్​గా, సర్వర్​ సైడ్ వెబ్​ క్రియేటర్స్​ను బ్యాక్​ఎండ్​ డిజైనర్​​గా పిలుస్తారు. ఫ్రంట్​ఎండ్ డిజైనర్లు వెబ్​సైట్​ డిజైన్​ చేయడానికి హెచ్​టీఎంఎల్​, స్టైల్స్​ను యాడ్​ చేయడానికి సీఎస్​ఎస్​, బూట్​ స్ట్రాప్,​ సిమాంటిక్​, యూఐ సాఫ్ట్​వేర్స్​ను ఎఫెక్ట్స్​ను యాడ్​ చేయడానికి యాంగ్యులర్​ జేఎస్​, జేక్వేరీ, ఒరాకిల్​, మై ఎస్​క్యూఎల్, మ్యాంగో డీబీ వంటి అడ్వాన్సుడ్​​ టెక్నాలజీస్​ను నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ ​ఎండ్​ డిజైనర్స్​ పీహెచ్​పీ, జావా, రూబీ, పైథాన్​, జావా వంటి సాఫ్ట్​వేర్​ లాంగ్వేజెస్​పై పట్టు సాధించాలి.

కంపెనీలు

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలన్నింటిలోనూ వెబ్​డిజైనర్స్​ రిక్వైర్​మెంట్​ ఉంటుంది. టీసీఎస్, యాక్సెంచర్​, విప్రో, అమెజాన్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్ర, కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో అవకాశాలెక్కువ. ఇవేకాక రోజురోజుకూ కొత్త కొత్త స్టార్టప్​ కంపెనీలు పుట్టుకొస్తుండటంతో వీటిలో అవకాశాలు కూడా పెరిగాయి. కంపెనీలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, హాస్పిటల్స్​, ఈ–కామర్స్, ఈ–లెర్నింగ్​, మీడియా ఇలా ఏ రంగంలోనైనా ప్రతి సంస్థకు వెబ్​ డిజైనర్స్​​ అవసరం ఉంటుంది.

శాలరీస్

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వెబ్​సైట్​ అనేది కీలకం. దీని ద్వారానే తమ ప్రోడక్ట్స్​, సర్వీసెస్​ను యూజర్​కు ఈజీగా అందుబాటులోకి తీసుకొస్తాయి. డిఫరెంట్ స్టైల్స్​లో ఆకట్టుకునేలా వెబ్​సైట్స్​ డిజైన్​ చేసేవారికి ఆకర్షణీయ వేతనాలు ఉంటాయి. ఏ కంపెనీలో చేరినా ప్రారంభవేతనం నెలకు 15వేల నుంచి 30 వేల వరకు అందుకోవచ్చు. కనీసం ఐదేళ్ల ఎక్స్​పీరియన్స్​తో 50 వేల నుంచి లక్ష వరకు జీతాలు చెల్లించే మల్టీనేషనల్​ కంపెనీలూ ఉన్నాయి. వర్క్​ ఫ్రం హోం ద్వారా కూడా ఫ్రీలాన్సర్​గా వర్క్​ చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నవారూ ఉన్నారు.

వెబ్​సైట్​ ఎందుకు?

ఏ కంపెనీకైనా తమ ప్రోడక్ట్, సర్వీసెస్​ గురించి యూజర్​కి తెలియజేయడానికి, సింపుల్​గా యూజర్​ తమను అప్రోచ్​ అవ్వడానికి వెబ్​సైట్​ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వెబ్​సైట్​ ద్వారా కంపెనీ బిజినెస్​ డెవలప్​మెంట్​కు యూజ్​ అవ్వడంతో పాటు ఆ కంపెనీకి జెన్యూనిటీ వస్తుంది. అంతేకాక యూజర్​ ఏ క్షణంలోనైనా తనకు కావాల్సిన సమాచారాన్ని 24/7 తెలుసుకోవచ్చు. చాట్​బాక్స్ ఫీచర్​ ద్వారా యూజర్ తనకున్న సందేహాలను ఈజీగా నివృత్తి చేసుకోవచ్చు.​

ఎక్కడ నేర్చుకోవాలి

ఒకప్పుడు కేవలం కంపెనీకి సంబంధించిన బేసిక్​ ఇన్ఫర్మేషన్​ ప్రొవైడ్​ చేయడానికే వెబ్​సైట్స్​ రూపొందించేవారు. కానీ ట్రెండింగ్ ప్రకారం నూతన టెక్నాలజీస్​ను బేస్​ చేసుకొని వెబ్​సైట్స్​ క్రియేట్​ చేస్తున్నారు. వీటికి తగ్గట్టు వెబ్​డిజైనింగ్ కోర్సులు నేర్చించే సంస్థలు  హైదరాబాద్​లో పెరిగాయి. అమీర్​పేట్​, దిల్​సుఖ్​నగర్​ వంటి ఏరియాల్లో వందలాది ప్రైవేట్​ ట్రైనింగ్​ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా సీ–-డాక్‌‌- హైదరాబాద్‌‌, ఎన్‌‌ఐఈఎల్‌‌ఐటీ- తిరుపతి వంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వారు ఆన్​లైన్​ ప్లాట్​ఫాంలోనూ ఉచితంగా నేర్చుకోవచ్చు. క్లాస్​రూంలో నేర్చుకున్న దాన్ని సొంతంగా సిస్టమ్​పై డిజైన్​ చేసినప్పుడే మనకు కాన్ఫిడెన్స్​ వస్తుంది. మనం డిజైన్​ చేసిన వెబ్​సైట్స్​ మోడల్స్​ను సంస్థలు చేసే జాబ్​ ఇంటర్వ్యూలలో చూపించినప్పుడు అదనపు అర్హతగా ఉంటుంది. తద్వారా ఈజీగా జాబ్​ సొంతం చేసుకోవచ్చు. సొంతంగా డిజైన్​ చేసిన వెబ్​సైట్స్​ను ప్రమోట్​ చేసుకొని ఫ్రీలాన్సింగ్​ ప్రాజెక్ట్స్​ను​ కూడా చేపట్టి లక్షల్లో సంపాదిస్తున్నవారూ ఉన్నారు.

ఫ్రీలాన్సర్​గా వర్క్​ చేయెచ్చు

నేటి టెక్నాలజీ యుగంలో స్టార్టప్​ల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని స్టార్టప్స్​ తమ ప్రోడక్ట్స్​, సర్వీసెస్​ను సరిగా ప్రమోట్​ చేసుకోలేక ఫెయిల్​ అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఆయా సంస్థలు తమ సొంత వెబ్​సైట్​ను రూపొందించుకుంటే యూజర్​ను ఈజీగా రీచ్​ అవ్వొచ్చు. జాబ్​ ఇంటర్వ్యూకి వెళ్లే అభ్యర్థికి రెజ్యూమ్​ ఎంత ముఖ్యమో ప్రతి సంస్థకు వెబ్​సైట్​ అంత ముఖ్యం. దీని​ ద్వారానే కంపెనీ ఈజీగా యూజర్​ను రీచ్​ అవ్వొచ్చు. అంతటి ప్రాముఖ్యత ఉన్న వెబ్​డిజైనింగ్​లో అవకాశాలకు ఢోకా లేదు. ఫ్రీలాన్సర్​గా కూడా వర్క్​ చేసే అవకాశం ఉండటం ఈ కోర్సు ప్రత్యేకత. క్రియేటివ్​ థింకింగ్, న్యూ టెక్నాలజీస్​పై పట్టు​ ఉన్న వారికి వెబ్​ డిజైనింగ్​ బెస్ట్​ ఛాయిస్​.

– కొండూరి వేణు, డైరెక్టర్​, న్యూ జనరేషన్​ టెక్నాలజీస్

Latest Updates