టాటూతో జర జాగ్రత్ర!

స్టయిల్‌‌గా కనిపించాలని కొందరు, సరదాకు,  ఇంకొందరు సెంటిమెంట్‌‌తో మరికొందరు  టాటూ వేయించుకుంటారు.  ఇష్టమైన హీరో, సెలబ్రిటీ కూడా టాటూతో  కనిపిస్తుండటంతో.. టాటు వేయించుకోవడానికి ఇంట్రెస్ట్‌‌ చూపిస్తున్నారు. అయితే, ‘టాటూకు ఉపయోగించే సూది, రంగులు చర్మానికి హాని కలిగిస్తాయి. అంతేకాదు ఇన్‌‌ఫెక్షన్లకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి’ అంటున్నారు డెర్మటాలజీ ఎక్స్‌‌పర్ట్స్‌‌. టాటూ వేసుకోవడం తప్పు కాదు. కానీ, వేయించుకోవడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

  • టాటూలో వాడే సిరా, పలు రంగుల్లో ఉన్న డై వల్ల చర్మం మీద దురద పెట్టడం,  చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి ఎలర్జీలు రాకుండా ఉండాలంటే నేచురల్ కలర్స్‌‌తో టాటూ వేయించుకోవాలి.
  • టాటూ వల్ల హెపటైటిస్‌‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. టాటూ వేసేందుకు ఒకరికి వాడిన సూదినే మరొకరికి వాడటం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
  • టాటూ వేసేటప్పుడు ఇంక్‌‌ చర్మంలోకి వెళుతుంది. ఒకవేళ బ్లడ్‌‌ ఇన్‌‌ఫెక్షన్‌‌ అయిన సూదిని, రంగుని మరొకరికి యూజ్‌‌ చేయడం వల్ల బ్లడ్‌‌ ఇన్‌‌ఫెక్షన్స్‌‌ వచ్చే అవకాశం ఉంటుంది.  టాటూ వేసుకునే ముందు నీడిల్‌‌, డై  క్లీన్‌‌గా ఉన్నాయో? లేవో? చెక్‌‌ చేసుకోవాలి.
  • టాటూ వేసుకున్న చోట నెమ్మదిగా చెమట పట్టడం తగ్గిపోతుంది. దీని వల్ల బాడీ టెంపరేచర్‌‌‌‌లో మార్పులు వస్తాయి. ఇది జీవక్రియ (మెటబాలిజమ్‌‌) మీద ప్రభావం చూపిస్తుంది.
  • టాటూ వేసిన చోట చర్మం ఉబ్బి, దద్దుర్లు వస్తాయి. పర్మినెంట్‌‌ టాటూ వేసుకుంటే.. ఎప్పుడైన  అవసరమైన ఎంఆర్‌‌ఐ  స్కాన్‌‌ చేయించుకుంటే  సరిగ్గా రాదు.  ఈ సమస్య అందరిలో కనిపించకపోవచ్చు.

Latest Updates