పిల్లలకు క్యారెట్ మంచిదే

పిల్లలకు హెల్దీ ఫుడ్ పెడితేనే యాక్టివ్ గా ఉంటారు. అలాంటి ఫుడ్ లో క్యారెట్ ముందు వరుసలో ఉంటుంది.. పిల్లలకు తరచూ క్యారె ట్ తినిపిస్తే ఎన్ని లాభాలున్నాయో మీరే చూడండి. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారెట్లను తినిపించాలి. పది నెలలు దాటిన పిల్లలకు క్యారెట్లు తినిపించొచ్చు. అయితే క్యారెట్ ని ఇతర కూరగాయలతో పాటు ఉడకబెట్టి తినిపించాలి. క్యారెట్లతో స్టార్ట్ చేయాలి పిల్లల కోసం ఆర్గానిక్ క్యారె ట్లను ఎంచుకోవాలి. వాటిని చల్లటి నీటిలో బాగా కడగాలి. తొక్కలను తీసేసి చిన్న ముక్కలుగా కోయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు బాగా మెత్తగా ఉడికించాలి.

బాగా ఉడకబెట్టిన తర్వాత వాటిని బయటకు తీసి, చల్లటి నీటిలో కొద్దిసేపు ఉంచాలి. ఉడికించిన క్యారె ట్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు క్యారె ట్ ముద్దను ఒక గిన్నెలో వేసి పిల్లలకు ఇవ్వాలి. వీటిలో ఉడికించిన బ్రోకలీ, గ్రీన్ బీన్స్, యాపిల్, దోసకాయలు, ఆలుగడ్డ ముక్కలు, బ్రౌన్ రైస్, చిక్కుళ్లు, మాంసం కలిపి తినిపించొచ్చు. కానీ పిల్లలకు ఏదైనా తినిపించేముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. కొంతమంది పిల్లలకు అలెర్జీ సమస్యలు ఉండడం వల్ల క్యారె ట్, బీట్‌‌రూట్ లేదా పాలకూర లాంటివి పెట్టకపోవడమే మంచిది అని చెప్తారు డాక్టర్లు.

Latest Updates