కార్ల ఎగుమతులు కాస్త బెటర్

న్యూఢిల్లీ:ప్యాసెంజర్ వెహికిల్ ఎక్స్ పోర్ట్‌లు స్వల్పంగా పెరిగాయి. గత ఆర్థిక ర్థి సంవత్సరంలో 6,77,311 యూనిట్ల ప్యాసెంజర్ వెహికిల్స్ ను ఎక్స్ పోర్ట్ చేసినట్టు సియామ్ డేటాలో వెల్లడైంది. 2018–19 ఆర్థికర్థి సంవత్సరంలో ఈ ఎక్స్ పోర్ట్‌ లు 6,76,192 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఎక్స్ పోర్ట్ ల వృద్ధి 0.17 శాతంగా ఉంది. అయితే కారు షిప్‌మెంట్లు 4.51 శాతం తగ్గి 4,90,748 యూనిట్లుగా ఉన్నాయి. యుటిలిటీ వెహికిల్ ఎక్స్ పోర్ట్‌ లు 16.06 శాతం పెరిగి 1,83,671 యూనిట్లుగా ఉన్నట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్స్(సియామ్) డేటాలో వెల్లడైంది. వాన్‌ల ఎక్స్ పోర్ట్ లు 28.22 శాతం తగ్గి 2,893 యూనిట్లుగా ఉన్నాయి.

2018–19 ఆర్థికర్థి సంవత్సరంలో ఇవి 4,029 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ డేటా తెలిపింది. ఎక్స్ పోర్ట్ సెగ్మెంట్‌లో హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ముందంజలో ఉండగా.. ఫోర్డ్ఇండియా రెండో స్థానంలో, మారుతీ సుజుకి ఇండియా మూడో స్థానంలో ఉన్నట్టు సియామ్ డేటా పేర్కొంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ గతేడాది 1,69,861 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ చేసింది. అంతకుముందు ఏడాది తో పోలిస్తే దీని ఎక్స్ పోస్తేర్ట్‌ లు 4.78 శాతం పెరిగాయి. ఫోర్డ్ఇండియా 1,31,476 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2018–19తో పోలిస్తే 2019–20లో ఎగుమతి చేసిన యూనిట్లు 19.24 శాతం తగ్గాయి. మారుతీ సుజుకి 2019–20లో గ్లోబల్ మార్కెట్లకు 1,00,294 ఎగుమతి చేసింది.

2018–19తో పోలిస్తే దీని ఎగుమతులు కూడా 5.83 శాతం తగ్గాయి. మొత్తం సేల్స్ డౌన్….మొత్తంగా 2019–20లోప్యాసెంజర్ వెహికిల్ సేల్స్ 17.82 శాతం తగ్గి27,75,679 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇవి అంతకుముందు ఆర్థికర్థి సంవత్సరంలో 33,77,389 యూనిట్లుగా ఉన్నాయి.

Latest Updates