మాస్కు లేకుండా తిరుగుతున్న 56మందిపై కేసు

జనగామ అర్బన్ , వెలుగు: జనగామ పట్టణంలో మాస్క్ లేకుం డా తిరు గుతున్న 56 మందిపై కేసులు నమోదు చేసినట్లు టౌన్ సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించకుండా నిర్లక్యంగా వ్యవహరించిన 15 మంది షాపు ఓనర్లపై కూడా కేసు నమోదు చేశామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు, షాపుల ఓనర్లు కోవిడ్ నిబంధనలు​ కచ్చితంగా పాటించాలని కోరారు.

Latest Updates