చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

చటాన్‌పల్లిలో నిన్న(శుక్రవారం) జరిగిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. దిశ కేసు దర్యాప్తు అధికారి షాద్ నగర్  ఏసీపీ సురేందర్‌రావు ఫిర్యాదుతో ఎన్‌కౌంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను తీసుకుని నేర ఆధారాల సేకరణకు చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి నిన్న తెల్లవారు జామున వెళ్లామని, అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైనట్లు వివరించారు.

Latest Updates