రూల్స్ పాటించని ఇద్దరిపై కేసు నమోదు

నల్గొండ క్రైం, వెలుగు: నల్గొండలోని కంటైన్మెంట్ జోన్లపరిధిలో రూల్స్ పాటించని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతోపాటు, ఆరు వాహనాలను సీజ్ చేశామనినల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిచెప్పారు. వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, టూటౌన్ ఎస్ఐ నర్సింహులుతో కలిసి సోమవారంఆయన కంటైన్ మెంట్ జోన్లలో పర్యటించారు.

ఈ సందర్భంగా డీఎస్పీమాట్లాడుతూ.. రెడ్ జోన్లపరిధిలో ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించి కరోనాని యంత్రణకు సహకరించాలని కోరారు.

 

Latest Updates