పబ్ లో అమ్మాయిలపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే కొడుకు

పబ్ లో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు అశిష్ గౌడ్ వీరంగం సృష్టించాడు. మాదాపూర్ లోని నోవాటేల్ హోటల్ లోని పబ్ లో ఫుల్లుగా మద్యం సేవించిన అశీష్ గౌడ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేగాకుండా వారిపై దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై బిగ్ బాస్-2 కంటెస్ట్ సంజన మరి కొందరు అమ్మాయిలు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేయిపట్టి లాగడమే గాకుండా బూతులు తిట్టాడని..అశీష్ ప్రవర్తనతో భయమేసిందని చెప్పారు. అశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా హోటల్ సిబ్బంది పట్టించుకోలేదని చెప్పింది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates