కోయిలమ్మ ఫేమ్ సమీర్‌పై కేసు నమోదు

కోయిలమ్మ ఫేమ్ సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఒక యువతి ఇంటికెళ్లి గొడవపడటంతో.. ఆ యువతి సమీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణికొండకు చెందిన శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీలు బొటిక్ నిర్వహించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల స్వాతి బొటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వలేదు. దాంతో స్వాతి.. కోయిలమ్మ ఫేమ్ సమీర్‌తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. అక్కడ మాటామాటా పెరిగి గొడవ పడ్డారు. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా స్వాతి కూడా శ్రీవిద్యపై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురి ఫిర్యాదులో స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates