అశ్వత్థామ రెడ్డిపై కేసు పెట్టిన ఆర్టీసీ డ్రైవర్

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కార్మికుల మరణాలకు అశ్వత్థామ రెడ్డే కారణమంటూ కూకట్ పల్లి డిపో డ్రైవర్ రాజు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ విలీనం పేరుతో అశ్వత్థామ రెడ్డి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని  అన్నారు. ఆర్టీసీ విలీనం కార్మికుల డిమాండ్ కాదని..అశ్వత్థామ రెడ్డి వ్యక్తిగత డిమాండ్ అని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు  అశ్వత్థామ రెడ్డిపై 506, 341  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Updates