విలేకరిని బెదిరించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేప్

హైదరాబాద్:  నీ ఇంటికొస్త.. నీ కాళ్లు.. చేతులు నరుకుత నంటూ పటాన్ చెరువు వార్త దినపత్రిక విలేకరి సంతోష్ నాయక్ ను అసభ్యకర పదజాలంతో దూషించిన టిఆర్ఎస్ ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్జాలపై వార్త రాసినందుకు ఎమ్మెల్యే దూషించిన వైనం సంచలనం రేపింది. బాధితుడితో కలసి నిన్న అమీన్ పూర్ పోలీస్టేషన్లో టీయూడబ్ల్యూజే, ఐజేయు విలేకరుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు (క్రైమ్ నెం: 331/2020 u/s 109,448,504,506-IPC,3 (2) (Va)-SC ST POA ACT 2015 at PS/District:  Ameenpur / Sangareddy ) నమోదు చేశారు.

Latest Updates