కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవు

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనా పాజిటివ్ అంటూ ఎవరైనా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. దయచేసి ఎవరూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయవద్దని స్పష్టం చేశారు.

ఇప్పటికే  కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేపట్టింది. కరోనా అనుమానితులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను ఎప్పటి కప్పుడు అలర్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ను మూసివేసింది.

Latest Updates