క‌రీంన‌గ‌ర్ లో క‌రోనాకు కార‌ణ‌మైన‌వారిపై కేసులు

కరీంనగర్ లో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు. కరోనా వైరస్ విస్తరించడానికి కారణమైన పదిమంది ఇండోనేషియన్లతో పాటు ప‌లువురిపై కేసులు న‌మోదు చేశారు. ఇండోనేషియ‌న్ల‌తో వచ్చిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ వాసులు, కరీంనగర్ చెందిన ముగ్గురిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఉల్లంఘిస్తూ కరీంనగర్ కు రావడమే కాకుండా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వీరంతా కారణమయ్యారని పోలీసులు తమ చార్జిషీట్ లో తెలిపారు.

గత నెల 14న రామగుండం నుంచి 7 సీటర్ ఆటోలో 10 మంది ఇండోనేషియా వాసులు, ఇద్దరు ఉత్తర ప్రదేశ్ వాసులు, కరీంనగర్ కు వచ్చి ముకరంపురలోని ఓ మసీదులో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా ఇక్కడికి రావడానికి కారణమైన ముగ్గురు కరీంనగర్ వాసులపై కూడా కేసు నమోదు చేశారు. ఎపిడమిక్ యాక్ట్-1897, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు చేశామ‌ని తెలిపారు.

Latest Updates