లాక్ డౌన్ రూల్స్ బ్రేక్.. లక్షా 20 వేల బండ్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్​ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా చాలా మంది రూల్స్ బ్రేక్​ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక సాకుతో రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులవుతున్నారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 23 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 1,20,415 మంది రూల్స్ బ్రేక్ చేసి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు లాక్ డౌన్ చెకింగ్ లో 1,20,415 వెహికల్స్​ సీజ్ చేశారు. ఇందులో 8,709 మందిపై ఐపీసీ సెక్షన్లతోపాటు జీవో నంబర్ 45, 46 వయలేషన్ కేసులు నమోదు చేశారు. మిగతా వారిపై వివిధ సెక్షన్ల కింద  కేసులు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో బుధవారం వరకు మోటార్ వెహి కల్ యాక్ట్ కింద మరో 10,26,912 కేసులు నమో దయ్యాయి. సీసీ టీవీ ఫుటేజ్​ తోపాటు ట్రాఫిక్ పోలీ సుల చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ వయలేషన్ కేసులు రిజిస్టర్ చేశారు. 63,245 వెహికల్స్  సీజ్ చేశారు.

Latest Updates