రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై కేసులు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కేంద్రానికి తప్పుడు రిపోర్టులు ఇచ్చారన్న ఆరోపణలపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సహా ఆరుగురు రిటైర్డ్​ఐఏఎస్ లు, ఐపీఎస్ లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దినేశ్ రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ లు ఎ.విద్యాసాగర్, రత్నప్రభ, ఎస్వీ ప్రసాద్, పీకే మహంతి, రిటైర్డ్ ఐపీఎస్ సీఎస్ఆర్ కేఎల్ఎన్ రాజులపై ఐపీసీ సెక్షన్లు 201, 203, 204, 213, 193 రెడ్ విత్ యాక్ట్120(బి) కింద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 9న ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా రామాయపల్లికి చెందిన రచయిత్రి వత్సలఈ నెల 9న నాం పల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎ.విద్యాసాగర్‌, మరో ఐఏఎస్ అధికారి రత్నప్రభ గతంలో తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని ఆమె ఆరోపించారు. 2011లో రత్నప్రభ, విద్యాసా గర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్​ను దుర్వినియోగం చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి వత్సల ఫిర్యాదు చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిందని పిటిషన్ లో తెలిపారు. 2011లో అప్పటి సీఎస్ పీకే మహంతి విచారణ జరిపి రిపోర్ట్​ ఇవ్వాలని అప్పటి డీజీపీ దినేశ్ రెడ్డిని ఆదేశించారు.

ఇదే సమయంలో విద్యాసాగర్ ను కూడా వివరణ కోరారు. అయితే పోలీస్ ఎంక్వయిరీపై విద్యాసాగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాసాగర్, రత్నప్రభపై ప్రకాశం జిల్లా ఎస్పీ డీజీపీకి రిపోర్ట్​అందించారు. 2013లో విద్యాసాగర్ నుంచి అప్పటి సీఎస్ ఎస్వీ ప్రసాద్ కు వివరణ లెటర్ అందింది. అదే ఏడాది అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే విద్యాసాగర్, రత్నప్రభకు అనుకూలంగా వ్యవహరిస్తూ మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మాజీ సీఎస్ లు పీకే మహంతి, ఎస్వీ ప్రసాద్,రిటైర్డ్​ ఐపీఎస్ అధికారి సీఎస్ఆర్ కేఎల్ఎన్ రాజు కేంద్రానికి తప్పుడు నివేదికలు అందించారని వత్సల తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా నలుగురు రిటైర్డ్​ ఐఏఎస్ లు, ఇద్దరు రిటైర్డ్​ ఐపీఎస్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరిపి రిపోర్ట్​ ఇవ్వాలని సై ఫా బాద్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Latest Updates