అడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు

ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా అడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. రూల్స్ కు విరుద్దంగా కమర్షియల్ గూడ్స్ క్యారీ చేస్తున్న ట్రావెల్స్ పై పెనాల్టీలు వేశారు. విజయవాడ, బాంబే, బెంగళూర్, నాగ్ పూర్ హైవే మార్గాల్లో దాడులు నిర్వహించారు అధికారులు. 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ వసూల్ చేస్తున్నట్లుగానే చార్జీలు తీసుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. మరో వారం పదిరోజుల పాటు దాడులు కొనసాగుతాయన్నారు అధికారులు.

Latest Updates