ఆల్​ ఇండియా CAT టాపర్… ​స్టూడెంట్​ కాదు.. మాస్టర్​

క్యాట్​ ఫలితాల్లో ఆల్​ ఇండియా టాపర్​ కొండూరి మారుతి. మన తెలుగు వాడే. కానీ ఇతను స్టూడెంట్​ కాదు. హైదరాబాద్​లో ప్రొఫెషనల్​ కోచింగ్​ మాస్టర్​. క్యాట్​కు ప్రిపేరయ్యే స్టూడెంట్లకు ఆన్​లైన్ కోచింగ్​ ఇస్తున్నడు. పదేళ్ల కిందటే అహ్మదా​బాద్​ ఐఐఎంలో ఎంబీఏ చేశాడు. సింగపూర్​, హాంకాంగ్​లో జాబ్​ చేసి.. అక్కడ బోర్​ కొట్టి  తిరిగొచ్చాడు. కానీ.. మళ్లీ క్యాట్​ ఎంట్రన్స్​ ఎందుకు రాశాడు..? ఆయన మాటల్లోనే..

ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి స్ట్రెస్, భయం ఉంటాయి. అదీ హాల్లోకి వెళ్లాక ఇంకా ఎక్కువవుతుంది. చాలామంది క్వశ్చన్ పేపర్ ఇచ్చిన 10 నిమిషాల వరకు ఒక్క క్వశ్చన్‌‌కూ ఆన్సర్ చేయలేరు. అలాంటివి ఎలా ఓవర్‌‌‌‌కమ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎగ్జామ్ రాశా. నేను రాసేటప్పుడు పేపర్ ఎలా అన్పించింది? నెగెటివ్ మార్క్స్ ఉన్నా సరే నేను ఎలా అటెంప్ట్ చేశా? ఫస్ట్ 10 నిమిషాలలో ఎన్ని క్వశ్చన్స్​కు ఆన్సర్ రాశాను? వంటివి నేను రాస్తేనే తెలుస్తుంది. వాటిని నేను ఇనిస్టిట్యూట్‌‌కు వచ్చే ఆస్పిరెంట్స్‌‌కు చెప్పొచ్చు. అందుకే ఈ ఇయర్ క్యాట్ ఎగ్జామ్ రాశా. నేను ఆల్‌‌రెడీ ఎంబీఏ చేశాను, నెగిటివ్ పెట్టినా నాకేం ప్రాబ్లమ్ లేదు కాబట్టి చాలా ఈజీగా ఎగ్జామ్ రాశా. అందుకే 100 పర్సంటైల్ వచ్చిందనుకుంటున్న.

క్యాట్‌‌ ఎవ్రీ ఇయర్ పేపర్‌‌‌‌లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్ కేటగిరీలలో రీజనింగ్ పార్ట్ చాలా టఫ్‌‌గా వస్తోంది. టైం వేస్ట్ చేసేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అవన్నీ ఎలా చేయాలో తెలియాలంటే ఎగ్జామ్ రాయాల్సిందే. క్లాసులో కూర్చొని పాఠాలు చెబితే ఇవన్నీ తెలియవు. మా ఇనిస్టిట్యూట్ తరఫున ప్రతి ఇయర్ నా భార్య సయాలి రాసేది. తను ఇప్పుడు రాయలేకపోవడంతో నేను అటెంప్ట్ చేశా. 2008లో రాశాను మళ్లీ ఇప్పుడు రాశా అంతే. అప్పటికి ఇప్పటికి నేను ఎగ్జామ్ రాయడంలోనే తేడా కన్పించింది. టెన్షన్ పడలేదు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా భయపడకుండా ఆన్సర్ రాశా. స్ట్రెస్ ఫ్రీ కోసం మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ఎగ్జామ్​కు వెళ్తున్నామన్న ఫీలింగ్‌‌తో కాకుండా కామన్‌‌గా వెళ్లాలి. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్‌‌కు ఆన్సర్ చేయాలి. ఏదో ఒకటి ఆన్సర్ చేస్తూ వెళ్తే ఎగ్జామ్ జోన్‌‌లోకి ఎంటరవుతాం. అది చాలా ఇంపార్టెంట్.

హాంకాంగ్‌‌లో జాబ్ చేస్తున్నప్పుడు దీపావళి పండుగ వచ్చింది. ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను మాత్రం ఆఫీస్‌‌కు వెళ్లా.  నాకిష్టమైన పండగరోజు నేను ఇంట్లో లేను. కనీసం నాకు ఇక్కడ హాలీడే కూడా లేదు. ఇలాంటి జాబ్ నాకు అవసరమా అన్పించింది. అసలు జాబ్ అంటేనే ఇంట్రస్ట్ పోయింది. వెంటనే మానేసి హైదరాబాద్‌‌కు వచ్చేశా. నాకు చదువు చెప్పడమంటే చాలా ఇష్టం. ఎవరైనా డౌట్స్ అడిగినప్పుడు వాటిని క్లారిఫై చేసినప్పుడు చాలా హ్యాపీగా అన్పించేది. అలా నేనే క్యాట్​కు ప్రిపేరయ్యేవారి కోసం ఒక ఇనిస్టిట్యూట్ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే నా భార్య సయాలి కాలే, ఫ్రెండ్ శ్రీకాంత్‌‌ లింగమనేనితో కలిసి ‘క్రాకు’ అనే పేరుతో ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేశా.

నేను ఐఐటీ బాంబేలో చదివేటప్పుడు ఫస్ట్ టైం క్యాట్ రాశా. మ్యాథ్స్, రీజనింగ్ బాగానే చేశా కానీ ఇంగ్లిష్ కటాఫ్ క్లియర్ కాలేదు. తర్వాత సంవత్సరంపాటు వర్క్ చేస్తూ ఎగ్జామ్ రాశా. 99.92 పర్సంటైల్‌‌తో ఐఐఎం అహ్మదాబాద్‌‌లో సీటొచ్చింది. అక్కడే సయాలి పరిచయమైంది. ఆమెనే పెళ్లి చేసుకున్నా. ఇద్దరం కలిసి హాంకాంగ్‌‌లో వర్క్ చేశాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడే సెటిలయ్యాం. వాళ్లది థానే. నా కోసం తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంది. నాకు తనవల్ల మరాఠీ వచ్చింది. ప్రతి సంవత్సరం తనే ఎగ్జామ్ రాసినా 99 పర్సంటైల్ వచ్చేది. నేను పుట్టి పెరిగింది వైజాగ్‌‌లో. నాన్న పార్వతీశం స్టేట్ బ్యాంక్‌‌ ఎంప్లాయి. అమ్మ ఛాయ ఇంట్లోనే ఉంటారు. చాలా మంది ఇనిస్టిట్యూట్‌‌కు ‘క్రాకు’ అని ఎందుకు పెట్టారు అని అడుగుతుంటారు. ఐఐటీలో ఎక్కువ స్కోర్ వచ్చినవాళ్లని ‘క్రాకు’ అని పిలుస్తారు. అందుకే మా ఇనిస్టిట్యూట్‌‌కు
ఆ పేరు పెట్టాం.

– వెలుగు, హైదరాబాద్

Latest Updates