డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా కేసులో జైలు శిక్ష..జైలు నుంచి త‌ప్పించుకున్న పిల్లి

డ్ర‌గ్స్ అక్ర‌మ‌ర‌వాణా కేసులో జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్న పిల్లి త‌ప్పించుకుంన్న‌ట్లు తెలుస్తోంది. ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం ఇది విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా శ్రీలంక‌లో డ్ర‌గ్స్ ర‌వాణా అక్క‌డి అధికారులకు త‌ల‌నొప్పిగా మారింది.
శ్రీలంక లో మూగ‌జీవాలు డ్ర‌గ్స్ ర‌వాణా చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కొద్దిరోజుల క్రితం డ్ర‌గ్స్ ను స‌ర‌ఫ‌రా చేస్తున్న డేగ‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా కొలంబోలో రెండు గ్రాముల హెరాయిన్, రెండు సిమ్ కార్డ్ లు, మెమొరీ చిప్ ర‌వాణా చేస్తున్న పిల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పిల్లిని హైసెక్యూరిటీ ఉన్న వెలికాడ జైలులో నిర్భందించారు. తాజాగా ఆ జైలు నుంచి త‌ప్పించుకున్న‌ట్లు ప్ర‌ముఖ మీడియా సంస్థ అరుణ తెలిపింది. అయితే పిల్లిత‌ప్పించుకోవ‌డంపై జైలు అధికారులు స్పందించేందుకు నిరాక‌రించారు.

Latest Updates