పిల్లి ఆస్తి 14 వేల కోట్లు..!

పారిస్:బాప్ రే బాప్. యజమాని చావు.. ఓపిల్లిని అందలం ఎక్కించింది ! ప్రపంచంలోనే కోటీశ్వరురాలైన పిల్లిగా నిలబెట్టింది. రెండ్రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కా ర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లా గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(85) తుది శ్వాస విడిచారు. ఆయన పెంచుకున్న పిల్లే ఇది. బర్మీస్ జాతికి చెందినది. 2011లో తన మోడల్ ఫ్రెండ్ బాప్టిస్ ట్ గయాబికోని వద్ద దీన్ని కార్లు చూశారు. బాగా నచ్చే యడంతో బాప్టిస్ ట్ కు చెప్పకుండా ఎత్తుకొచ్చేసు కున్నారు. ముద్దుగా ‘షౌపెట్’ అని పేరు పెట్టుకున్నారు. కార్ల్, దాన్ని ఎలా చూసుకునే వారంటే వెండి పళ్లెంలో తప్ప వేరే వాటిలో తిండి పెట్టే వాళ్లు కాదు. ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్లతో పాటు మెయి డ్స్ కూడా ఎప్పుడూ పిల్లి బాగోగులు చూడటానికి ఉంచే వారు. అలా రాజభోగాలు అను భవించేది షౌపెట్ . జపనీస్‌ కాస్మోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్ల ప్రకటనల్లో షౌపెట్ కనిపించింది .ఈ యాడ్స్ ద్వారా 34 లక్షల డాలర్లు సంపాదించింది. దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది . తన మరణానికి ముందే కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిల్లి బాగో గుల గురిం చి ఆలోచించారు. తాను లేకున్నా వైభవంగానే జీవించాలని కోరుకున్నారు. పిల్లికి బాడీగార్డు, దాని మహిళా సేవకురాలిని ఎప్పటికీ కొనసాగించాలని వీలునామా రాశారు. ఇటీవల ‘షౌపెట్ ధనికురాలు’ అని ఓసారి ఫ్రెంచ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కా ర్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. తన ఆస్తి లో కొంత దాని పేరిట రాస్తున్నట్లు పరోక్షంగా సంకే తాలిచ్చారు. ఆయన సంపాదించిన ఆస్తిలో 14 వేల కోట్ల రూపాయలు షౌపెట్ కు దక్కను న్నాయని సమాచారం.

Latest Updates