నా మాట వినవా..చెల్లెల్ని కాల్చి చంపిన అన్న

ఫోన్లో మాట్లాడకు. చాటింగ్ చేయకు అని ఎంత చెప్పినా వినడంలేదని ఓ అన్న తన చెల్లిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపుతుంది. ఢిల్లీకి చెందిన అన్న(17)  సెలూన్ లో విధులు నిర్వహిస్తుంటే ..చెల్లెలు (16) చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయితే అన్న విధులకు వెళ్లడం..చెల్లెలు ఫోన్లో మాట్లాడడం,  చాటింగ్ లు చేస్తుంది. ఈ విషయం అన్నకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయినా చెల్లెలు తన పద్దతిని మార్చుకోనని అన్నతో వాదించింది. దీంతో విచక్షణ కోల్పోయిన నిందితుడు బాధితురాల్ని తుపాకీతో కాల్చి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితురాల్ని ఆస్పత్రికి తరలించగా..మార్గం మధ్యలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates