వేసవిలో జలుబుకు కారణాలు- నివారణ

causes-of-cold-in-summer-and-prevention

సర్ది (జలుబు) చేయడానికి కాలంతో సంబంధం తగ్గిపోతోంది. వానా కాలంలోఇప్పుడు ఎండాకాలంలోనూతుమ్ములు, దగ్గు లు, సర్దివస్తోందంటున్నరు. ఈ మాటవిన్నప్పుడల్లా మనుషులు సున్నితమై పోతున్నరనే అంటాం. ఇంత సున్నితంగామారడానికి కారణమేంది?

వేసవిలో ఆరుబయట నిద్రపోతే గొంతు బాగా నొస్తుందని, చలివేంద్రంలో బయట నీళ్లు తాగితే జలుబు చేసిందని చాలా మంది అంటుంటరు. అదే చలివేంద్రంలో చాలా మంది ఆ మంచి నీళ్లే తాగుతున్నరు.  ఎంతో మంది రాత్రి ఇంటిపై నిద్రపోతున్నారు. కానీ సమస్యలు కొందరికే ఎందుకొస్తున్నయి. వాళ్ల శరీరంలోకి వచ్చే బాక్టీరియా, వైరస్‌‌లను ఎదుర్కొనే శక్తి వాళ్ల శరీరంలో తగ్గిపోవడమే ఈ సమస్యలకు కారణం.

ప్రతి వ్యక్తికీ సహజంగానే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కానీ కొంత మందిలో అది తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాన్ని జలుబు, దగ్గు, జ్వరం గుర్తు చేస్తుంటాయ్‌‌. ఆ సమస్యనే పెద్ద ఇబ్బందిగా చూస్తూ గోలీలేసుకుంటారు. కానీ ఆ ఇబ్బందులకు కారణమైన వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గిందో మాత్రం ఆలోచించరు. అప్పుడప్పుడు ఈ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌‌, కామెర్ల వ్యాధితో ఏటా లక్షల మంది చనిపోతున్నారు. ఇవేవీ మందులు లేని రోగాలు కాదు. వైద్యం అందించేంతవరకన్నా ఆ రోగాలతో పోరాడే శక్తి ఉండట్లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు బాధపడేకన్నా ముందే వ్యాధి నిరోధకత పట్ల అవగాహన పెంచుకుంటే మన శరీరం ఎలా ఉందో అర్థమవుతుంది.

 కారణం ఇదంట..

మన శరీరంలో గాలి, నీరు, ఆహారం ద్వారా బాక్టీరియా, వైరస్‌‌, ఫంగస్‌‌లు ప్రవేశిస్తాయి. సూక్ష్మ పరిమాణంలో ఉండే వీటి ప్రవేశాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. వాటి జీవన చర్యలతో శరీరంలో జరిగే సాధారణ జీవ క్రియలకు ఆటంకం కలుగుతుంది. దానిని మనం రోగం అంటున్నాం. సూక్ష్మ జీవుల వల్ల వందల జబ్బులు వస్తున్నాయి.  అయితే అందరికీ ఎందుకు జబ్బులు రావంటే సహజంగానే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉన్నట్లే బాక్టీరియా, వైరస్‌‌లను చంపే తెల్ల రక్త కణాలు ఉంటాయి. మన శరీర ధర్మంలో ఇది కూడా ఒక పెద్ద వ్యవస్థ. తెల్లరక్తకణాల ఉత్పత్తి తగ్గినా, వాటి ప్రయాణం మందగించినా శరీర భాగాల్లో వాటి సంఖ్య తగ్గుతుంది. దీనిని వ్యాధి నిరోధక శక్తి తగ్గుదల అంటాం. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి జన్యు సంబంధమైనది. కొందరికి పుట్టుకతోనే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మేనరికం ఉన్న దంపతులకు పుట్టిన వారికి, జన్యువుల్లో మార్పుల వల్ల పుట్టుకతోనే మరి కొందరిలో వ్యాధి నిరోధక సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది సహజమైనదే కాబట్టి వైద్య పద్ధతుల్లో మార్చే అవకాశాలు లేవు. మరికొందరిలో పోషకాహార లోపం, జీవన శైలి వల్ల వ్యాధి నిరోధకత తగ్గిపోతుంది.

లోపం ఇక్కడుంది.. 

పెద్దవాళ్లు ఒకప్పుడు తీసుకున్న మంచి ఆహారం వల్ల శక్తి, పోషకాలు సమతులంగా ఉండేవి. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు భూమిలో, సాగు విధానంలో తేడాలు వచ్చాయి. ఆహారంలో పోషకాలు ఉండాల్సినంత ఉండట్లేదు.  రసాయనాలు వేసి పండించడం, పండక ముందే కోసిన పండ్లు, పాలిష్‌‌ చేసిన బియ్యం వాడటం వల్ల పోషకాహార లోపం పెరుగుతోంది. బాగానే తింటున్నామనే భ్రమలో చాలా మంది ఉన్నారు. ఆహారంలో నాణ్యత లేదు. అందువల్ల సరిగ్గా తినే వాళ్లలో కూడా వ్యాధినిరోధకత తగ్గుతోంది. విటమిన్‌‌ ఎ, సిలు, జింక్‌‌, సెలీనియం లోపం ఉంటే వ్యాధి నిరోధక సామర్థ్యం తగ్గుతుంది. మనం తినే డైట్‌‌లో కార్బోహైడ్రేట్స్‌‌ ఎక్కువగా ఉంటున్నాయి.  పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు ఎక్కువగా తింటున్నారు. వీటిని రెగ్యులర్‌‌గా తీసుకోవడం వల్ల నెమ్మదిగా రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల కణాలు డీ హైడ్రేట్‌‌ అవుతాయి. తెల్ల రక్తకణాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటాయి.

ఏం చేస్తే రోగం పోతది?

మంచినీళ్లు:మన శరీరంలో ఎక్కువ శాతం నీరుఉంటుంది. నీటిని సరిగా తీసుకోకపోతే.కణాలు ఆరోగ్యంగా ఉండవు. డీ హైడ్రేట్‌అవుతాయి. సాధారణ కణాల లాగేతెల్లరక్త కణాలు కూడా ఇదే తీరుగాక్రియారహితంగా ఉంటాయి. రోజుకుసుమారు మూడు లీటర్ల మంచి నీళ్లుతాగాలి.

విటమిన్‌ -–ఎ:పేగుల్లో ఉండే మ్యూ కోజల్‌ పొరనివిటమిన్‌–ఎ ఆరోగ్యంగా ఉంచుతుంది.ఈ పొర జీర్ణమైన ఆహారాన్ని శోషిస్తుంది.విటమిన్‌ –ఎ లోపిస్తే మ్యూ కోజల్‌ సరిగా లేక తిన్న ఆహారం వంటబట్టదు. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పాలు, ఆకుకూరల్లో విటమిన్‌ –ఎపుష్కలంగా ఉంటుంది.

ఖనిజాలు:తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో ప్రొటీన్లతోపాటు జింక్‌ , సెలీనియం ఖనిజ మూలకాలు కూడా ముఖ్యమే. జింక్‌ , సెలీనియం ముఖ్యమైనవి. జింక్‌ సముద్రపు చేపలలోఉంటుంది. సెలీనియం నట్స్‌ లోఉంటుంది.అప్పుడప్పుడు లేదా వారానికోసారి తినాలి. సమస్య తీవ్రంగా ఉంటే పూర్తిగా తినడం మానేయాలి.

విటమిన్‌ –సి:వ్యాధి నిరోధక సామర్థ్యాన్ నిపెం చే ‘విటమిన్‌ –సి’ సిట్రస్‌జాతి పండ్లలో అధికంగాఉంటుంది. నిమ్మ, నారింజ, బత్తాయితోపాటు పుల్లగా ఉండేఇతర కూరగాయలు, పండ్లలో పుష్కలంగా ఉంటుంది.

ప్రొటీన్‌ :వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటేముం దు ప్రొటీన్‌ లోపం లేకుం డాచూసుకోవాలి. తెల్ల రక్తకణాలఉత్పత్తిలో ఉండే అమైనోగ్లోబ్యు లిన్స్‌ తయారీకి కావాల్సిన అమైనో యాసిడ్స్‌ ప్రొటీన్‌ నుంచే అందుతాయి. ఇవి పాలు, మాం సం,గుడ్డు, చేపలు, పప్పులు, పల్లీలు,పాలు, సోయా ఉత్పత్తులు, నట్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. యూరిక్‌ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే పేషెంట్స్‌ పప్పులు ప్రతి రోజూ తినకూడదు.పాలు తాగడం మేలు.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ :తెల్ల రక్త కణాల ఉత్పత్తికి ఇదిదోహదపడుతుంది. ఇవి సముద్రపుచేపలు, అవిసె గింజల్లో ఎక్కువగాఉంటాయి.

సమతులాహారం:తరచుగా అనారోగ్యంతో బాధపడేవాళ్లుసమతులాహారం తీసుకోవాలి. అన్నం, చపాతీలతోపాటు మాం సం, గుడ్డు,పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు,పాల ఉత్పత్తులు కూడా తీసుకోవాలి.తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి

వ్యాయామం:డ్రింకిం గ్‌ , స్మోకిం గ్‌ , అలవాట్లుఉండటం, శారీరక శ్రమలేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఎముకమూలుగలో ఉత్పత్తయ్యే తెల్లరక్తకణాలు రక్తంలో, ప్లీహంలోఉంటాయి. వ్యాయామం చేయడంవల్ల శరీర కండరాల్లో ఒత్తిడి , కదలిక కలుగుతుంది. వీటి వల్ల రక్త ప్రసరణ పెరగడంతోపాటు తెల్ల రక్తకణాల్లోకదలిక వస్తుంది.

-డాక్టర్‌ నవోదయ్‌ జిల్లా , జనరల్‌‌ ఫిజీషియన్‌ ,కేర్‌ హాస్పిటల్‌‌, హైదరాబాద్‌

Latest Updates