చిదంబరం అరెస్ట్ కు ఈడీకి కోర్టు అనుమతి

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని INX మీడియా కేసులో అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)కి కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులోని మనీలాండరింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు కోసం చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని ED..ఢిల్లీలోని CBI ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది.దీనికి సంబంధించి కోర్టు ఇవాళ(మంగళవారం) అంగీకరించింది. తాజా తీర్పు క్రమంలో ED అధికారులు రేపు(బుధవారం) చిదంబరాన్ని తీహార్  జైల్లో ప్రశ్నించనున్నారు. తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉంది.

మొదట చిదంబరాన్ని అరెస్ట్ చేసి…ఆ తర్వాత విచారణ జరుపుతామని కోర్టుకు తెలిపారు ED అధికారులు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కొన్ని మార్పులు చేసి ఈడీ అభ్యర్థనకు ఒప్పుకున్నారు. మొదట చిదంబరాన్ని తీహార్ జైల్లో ఒక రౌండ్ విచారణ జరిపి తర్వాత అవసరం అనుకుంటేనే అరెస్టు చేయవచ్చని సూచించారు.

ప్రస్తుతం చిదంబరం ఢిల్లీలోని తీహార్ జైల్లో సీబీఐ కస్టడీలో ఉన్నారు.

Latest Updates