డాక్టర్‌ సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ

వైజాగ్ డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఓ కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం, తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారని సీబీఐ ఆరోపిస్తూ కేసు పెట్టింది. 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు. దీంతో వాటిని పరిశీలించి అతడిపై కేసు పెట్టారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్‌పై సెక్షన్ 188 నమోదైంది. ఇప్పటికే పోలీసులపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

Latest Updates