రూ.800 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ‌వేసిన కంపెనీపై సీబీఐ దాడులు

రాజ‌స్థాన్ సీఎంతో సంబంధాలు క‌లిగి ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్ అనే వ్య‌క్తికి చెందిన యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు జ‌రిపింది. ఢిల్లీ, గురుగాం, పంచకుల, చండీగఢ్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించింది.

రూ.800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కూడా యాంబియన్స్ గ్రూపుపై ఈడీ కేసులు న‌మోదు చేసింది. గురుగాంలోని యాంబియన్స్ మాల్ నిర్మాణం విషయంలోనూ అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చడంపై దర్యాప్తు చేపట్టాలని హైకోర్ట్ సీబీఐని ఆదేశించడంతో.. సీబీఐ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేసింది.

యాంబియన్స్ గ్రూపు అధినేతగా ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్.. అక్రమ మార్గాల్లో రుణాలు సేకరించి, నిధులు దారి మళ్లించినట్టు అభియోగాలున్నాయి. తప్పుడు కంపెనీలను సృష్టించి లావాదేవీలు నిర్వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలు విడివిడిగా దర్యాప్తు చేస్తున్నాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో రాజ్ సింగ్ కు సంబం‌ధాలున్నట్టు స‌మాచారం.‌

Latest Updates