సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

ఢిల్లీలో సీనియర్ లాయర్ల ఇళ్లలో CBI సోదాలు చేసింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచే సోదాలు కొనసాగాయి. సీనియర్ లాయర్లు.. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ ఇల్లు, ఆఫీస్ లలో అధికారులు తనిఖీలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. ఆనంద్ గ్రోవర్, అతని NGO లాయర్లు విదేశాల నుంచి నిధులు సేకరించినట్టు కేసు నమోదు అయింది. మానవ హక్కుల గురించి పోరాడుతున్నందునే… తమను మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు ఇందిరా జైసింగ్. మరోవైపు.. సీనియర్ లాయర్ల ఇళ్లపై సీబీఐ దాడులను అపోజిషన్ పార్టీ ఎంపీలు ఖండించారు. ఇది బెదిరింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. దాడులు సరికాదంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లెటర్ రాశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం ఎంపీలు.. ఈ లెటర్ పై సంతకాలు చేశారు.

Latest Updates