శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఉన్నావ్ దోషి కుల్దీప్ ప్రయత్నం

ఉన్నావ్ హత్యాచారం కేసులో దోషిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ను శిక్ష నుంచి తప్పించేందుకు ఆయన లాయర్లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

2017లో ఓ మైనర్ బాలిక తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరేందుకు కుల్దీప్ సింగ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మైనర్ బాలికపై కుల్దీప్ అత్యాచారం చేశాడు. కుల్దీప్ తో పాటు అతని అనుచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణంపై తనకు న్యాయం చేయాలని యూపీ సీఎం యోగి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉన్నావ్ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ తీస్ హజారీ కోర్ట్ కుల్దీప్ ను దోషిగా ప్రకటిస్తూ విచారణను 19కి వాయిదా వేసింది. 19న ఈ కేసుపై కోర్ట్ తుదితీర్పు ఇవ్వనుంది.

ఈ కేసులో బాధితురాలి తరుపున సీబీఐ అడిషనల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల్ని వినిపించనున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ తీస్ హజారీ కోర్ట్ న్యాయ వాది ఎదుట తన వాదనల్ని వినిపించినట్లు తెలుస్తోంది. సీబీఐ అడిషనల్ ప్రాసిక్యూటర్ అశోక్ భార్తేండ్ ..కోర్ట్ జడ్జ్ ధర్మేష్ శర్మ తో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడికి గరిష్టంగా శిక్ష విధించాలని కోరారు. బాధితురాలు వ్యవస్థను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుందని అన్నారు. అంతేకాదు బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పారు.

అత్యాచారం “శారీరక దాడి మాత్రమే కాదు, ఇది అపారమైన మానసిక గాయానికి కూడా కారణమవుతుంది”, ఈ కేసులో అనవసరమైన సానుభూతి చూపిస్తే శిక్ష యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుందని, ఇది దాని సామాజిక ప్రభావాన్ని దెబ్బతీస్తుందని సీబీఐ ప్రాసిక్యూటర్ తెలిపారు.  

అయితే తన క్లయింట్ కుల్దీప్ కు నామమాత్రం శిక్షను విధించానలి లాయర్ తన్వీర్ మీర్ తన వాదనల్ని వినిపించాడు. ఎమ్మెల్యే గా ప్రజా జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని వివరించాడు.  

కస్టడీ సమయంలో కుల్దీప్  ప్రవర్తన బాగానే ఉంది. అతనికి ఇద్దరు మైనర్ కుమార్తెలు ఉన్నారు, గతంలో ఎలాంటి నేరం చేయలేదు.  దయచేసి ఈ వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకొని తీర్పుఇవ్వాలని కుల్దీప్ న్యాయవాది తన్వీర్ తీస్ హజార్ కోర్ట్ జడ్జ్ ని కోరారు.

Latest Updates