కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సీబీఐ నోటీసులు

బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గత నెల 5వ తేదీన డీకే శివకుమార్ తోపాటు.. ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ ఇంటిపై కూడా  సీబీఐ  సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు జరిపింది. ఒక్క బెంగళూరులోనే తొమ్మిది  చోట్ల, ముంబైలో ఒక చోట, ఢిల్లీలో నాలుగు చోట్ల కలిపి మొత్తం 14 చోట్ల సోదాలు జరిపామని సీబీఐ ప్రకటించింది. అక్రమ ఆస్తుల వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates