సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు

CBI summons to TDP EX MP sujana chowdary

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు జారీచేసింది. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసారని ఆరోపణలున్న కారణంగా సీబీఐ తమ ముందు హాజరు కావాలని తెలిపింది. 2017లో ఆంధ్రా బ్యాంకు నుండి 71 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని బెంగళూరు సీబీఐ బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. కాగా ఆ కేసుకు సంబంధించి రేపు శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని సుజనాకు అధికారులు నోటీసులు అందించారు.

Latest Updates