CBSE ఇంటర్ ఫలితాలు విడుదల

CBSE123CBSE ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (మే-26) CBSE అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను ప్రకటించారు అధికారులు. CBSE 12వ తరగతిలో 83.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌ లోని స్టెప్ బై స్టెప్ స్కూల్‌ కు చెందిన మేఘనా శ్రీవాత్సవ్.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మేఘ‌న‌కు 99.8 శాతం మార్కులు వ‌చ్చాయి. అంటే 500కి.. 499 మార్కులు వచ్చాయి. ఉమంగ్, SMS ఆర్గనైజర్ యాప్స్ కూడా ఈ ఫలితాలను అందిస్తున్నాయి.

పేపర్ లీక్ కావటంతో.. ఎక‌నామిక్స్ పేప‌ర్‌ను ఏప్రిల్ 25వ తేదీ రెండో సారి నిర్వ‌హించారు. రెండు రోజుల్లో 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు కూడా వెల్ల‌డించ‌నున్న‌ట్లు CBSE సెక్ర‌ట‌రీ అనురాగ్ త్రిపాఠి తెలిపారు. మే 28 లేదా 29న ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి cbseresults.nic.in 

Posted in Uncategorized

Latest Updates