సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలపై క్లారిటీ

  • లాక్‌డౌన్‌ అయిపోగానే ఎగ్జామ్స్‌
  • 10 రోజుల ముందే స్టూడెంట్స్‌కు చెప్తాం
  • ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు

న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న 10, 12 తరగతి పరీక్షలపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది. లాక్‌డౌన్‌ అయిన వెంటనే ఫస్ట్‌ ప్రియారిటీ కింద పరీక్షలు నిర్వహిస్తామని బుధవారం ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు అనే విషయాన్ని స్టూడెంట్స్‌కు 10 రోజుల ముందే ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు చెప్పింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన దగ్గర పేపర్‌‌ వాల్యూషన్‌ స్టార్ట్‌ చేయాలని ఆదేశించింది. “ టెన్త్‌ ఎగ్జామ్స్‌పై ఈ మధ్య కాలంలో చాలా ఊహాగానాలు వచ్చాయి. 10, 12 క్లాసులకు సంబంధించి 29 సబ్జెక్టులకు పరీక్షలు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. 1.04.2020 సర్కులర్‌‌ ప్రకారమే ఎగ్జామ్స్‌ ఉంటాయి” అని సీబీఎస్‌ఈ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది.

పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్‌ను సీబీఎస్‌ఈ రద్దు చేస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో బోర్డు క్లారిటీ ఇచ్చింది. దేశమంతా లాక్‌డౌన్‌ కంటే ముందే పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఢిల్లీలో ఈ పరీక్షలు జరుగుతున్న టైంలో చాలా ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో పరీక్షలను వాయిదా వేశారు. మిగతా పరీక్షలు ముగిశాక వాటిని నిర్వహించాలని బోర్డు భావించినప్పటికీ.. అప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు స్టూడెంట్స్‌ను ఎగ్జామ్స్‌ లేకుండా ప్రమోట్‌ చేయాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది.

Related News:

లాక్ డౌన్ త‌ర్వాత ఎగ్జామ్ రాయాల్సిన స‌బ్జెక్టులివే

ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా CBSE విద్యార్థుల ప్ర‌మోష‌న్

Latest Updates