700 రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు

కాజీపేట,వెలుగు: నేరాల అదుపునకు సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని 700 రైల్వే స్టేషన్లలో,17‌‌0 కోట్ల రుపాయలతో  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు, రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్ ఇన్​స్పెక్టర్​ జనరల్ ఈశ్వర్ రావు తెలిపారు. గురువారం వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలోని ఆర్పీఎఫ్​ పోలీసు స్టేషన్ లో ఆర్పీఎఫ్ అధికారులతో  సంవత్సరపు తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్ ​పరిధిలోని రైల్వే ఆస్తుల పరిరక్షణకు, రైళ్లలో తనిఖీలకు  810 మంది ఆర్పీఎఫ్​ సిబ్బంది కొత్తగా రిక్రూట్ అయ్యారన్నారు. ట్రైన్‌లలో న్యూ సెన్స్​ కలిగిస్తే హిజ్రాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇబ్బందులు తలెత్తితే ప్రయాణికులు ఆర్పీఎఫ్​ హెల్ప్​ లైన్​ 182 నెంబర్ కు ఫోన్​చేయాలన్నారు.

Latest Updates